BJP Bus Yatra in Telangana 2023 : రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు.. కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర నాయకత్వం బీజేపీ బస్సు యాత్ర(BJP Bus Yatra)కు సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు యాత్ర జరిగేలా బీజేపీ ప్రణాళిక(BJP Plan)లు రచిస్తుంది. అందుకు సంబంధించిన మూడు మార్గాలను ఖరారు చేసింది. అందులో మొదటిగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాలను కలుపుతూ కుమురం భీం రూట్‌ను సిద్ధం చేసింది. రెండో రూట్‌లో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలను కలుపుతూ కృష్ణా రూట్‌ను సూచించారు. మూడోదిగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ గోదావరి రూట్‌ను నిర్ణయించారు.
Telangana Bus Yatra 2023 : బస్సు యాత్రను పర్యవేక్షించేందుకు 12 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా యాత్ర సమన్వయానికి జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర, జాతీయ నేతలు బస్సు యాత్రలో పాల్గొనేలా ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. బస్సు యాత్రకు ప్రత్యేక నామకరణం చేయనున్నట్లు బీజేపీ నాయకత్వం తెలిపింది. ఒకటి లేదా రెండు రోజుల్లో యాత్ర రూట్ మ్యాప్‌ను కమిటీలు పూర్తి చేయనున్నాయని రాష్ట్ర నేతలు తెలిపారు. బస్సు యాత్రలో ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై కూడా నేతలు చర్చిస్తున్నారు. బస్సు యాత్రతో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలనే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తుంది.
Bus Yatra Plan For BJP in Telangana : గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రతీకగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం సంపాదించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రను చేపట్టనుంది. అందుకు ఉమ్మడి పది జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్ర చేసేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. యాత్రకు సంబంధించి పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ, ఎన్నికల కమిటీ సహా ఇంఛార్జి సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేశారు.
Telangana Assembly Election BJP Plan : బస్సు యాత్ర నిర్వహణను కూడా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహణ బాధ్యత వహించిన వీరేందర్ గౌడ్, దీపక్ రెడ్డి, పాపారావు, విక్రమ్ గౌడ్‌లకు అప్పగించింది. మూడు క్లస్టర్లలో ప్రారంభమయ్యే యాత్రకు దీపక్ రెడ్డిని సమన్వయ బాధ్యతలు అప్పగించింది. ఈ మూడు యాత్రలకు రాష్ట్ర పార్టీ కీలక నేతలు సారథ్యం వహించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ నేతృత్వం వహిస్తారు.
BJP Bus Yatra Plan in Telangana : ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో .. బీజేపీ బస్సు యాత్ర
హైదరాబాద్‌లో బస్సు యాత్రకు బీజేపీ ప్లాన్.. ముందస్తు వ్యూహమేనా!