BJP Bheem Padayatra: రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దిల్లీలో భాజపా భీమ్ పాదయాత్ర చేపట్టింది. 'భాజపా భీమ్' పేరుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. దిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు భాజపా నేతలు పాదయాత్ర చేపట్టారు. ఇందులో బండి సంజయ్‌తో పాటు ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. దిల్లీలో గురువారం మౌనదీక్ష చేపట్టిన భాజపా నేతలు.. ఇవాళ పాదయాత్ర చేపట్టారు.
రాజ్యాంగంలో ఉందా..?
రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలను తెరాస నేతలు సమర్థించుకుంటున్నారు. ఇంత మంది ఆందోళనలు చేపట్టినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు. తెరాస ముక్త్ తెలంగాణ కోసం భాజపా పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేవరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తాం. దళితబంధు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?. ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్తది కట్టాలని రాజ్యాంగంలో ఉందా?. రిటైరైన వాళ్లను సలహాదారులుగా పెట్టుకోవాలని రాజ్యాంగంలో ఉందా?. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఉందా?. జీవోలతో ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని రాజ్యాంగంలో ఉందా?. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఇవి లేవు కాబట్టే.. కొత్తది కావాలంటున్నారా?. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు.. సీఎం కేసీఆర్‌ను. కేసీఆర్ పాలన పోవాలి.. ప్రజాస్వామిక తెలంగాణ రావాలి. అభినవ అంబేడ్కరుడు తానేనని పాఠ్యాంశాల్లో చేర్చేందుకే కేసీఆర్ కుట్ర. కేసీఆర్ అవినీతిపై విచారణ చేస్తారనే ఆందోళనతోనే ప్రజలను రెచ్చగొడుతున్నారు.
-బండి సంజయ్
నిన్న మౌనదీక్ష.. ఇవాళ పాదయాత్ర
సీఎం కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీ తెలంగాణభవన్ వద్ద బీజేపీ భీమ్ దీక్ష పేరుతో పేరుతో గురువారం గంటన్నరపాటు దీక్ష చేపట్టారు. భాజపా ఎంపీలు అర్వింద్, బాపూరావు సహా నేతలు పాల్గొన్నారు. తన దోపిడీని వ్యవస్థీకృతం చేసుకోవడానికే కొత్త రాజ్యాంగం తేవాలని కేసీఆర్ భావిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబపాలనను భరించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని బండి స్పష్టంచేశారు. దిల్లీలో గురువారం మౌనదీక్ష చేపట్టిన భాజపా నేతలు.. ఇవాళ పాదయాత్ర చేపట్టారు.
ఇదీ చదవండి: