BJP attack MLC kavitha House హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి భాజపా యత్నించింది. ఈ సంఘటనలో పోలీసులు, భాజపా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భాజపా నేతలను అరెస్ట్ చేశారు. పోలీసుల తోపులాటలో భాజపా కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు భాజపా నేతలను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన భాజపా నేతలను అరెస్ట్ చేశారు. భాజపా నేతల ప్రకటన దృష్ట్యా కవిత ఇంటి వద్దకు తెరాస శ్రేణులు భారీగా చేరుకున్నారు.
లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భాజపా నగర కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఒక్కసారిగా భాజపా కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. భాజపా కార్యకర్తలను తిప్పికొట్టేందుకు తెరాస కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఇవీ చదవండి: కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కవితతో రాజీనామా చేయించాలన్న మధుయాష్కీ