ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్లో బైక్ రైడర్స్ అవగాహనా ర్యాలీ నిర్వహించారు. హ్యార్లీ డేవిడ్సన్, గ్రీటింగ్స్ ఫ్రమ్ సీఐఐ యంగ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసినట్లుగానే శరీరంలోని అవయవాలను దానం చేయడంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండిః దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు