
పెద్ద పరిమాణంలో ఉన్న ముల్లంగి దుంపలను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ పంచాయతీ గొల్లలపాలానికి చెందిన యువ రైతు బొట్ట పాలవెల్లి సాగు చేశారు. ఈ యువ రైతు బొట్ట పాలవెల్లికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. తన పొలంలో అందరిలానే.. ముల్లంగి పంట సాగుచేశారు. ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టడం వల్ల మంచి దిగుబడులు వచ్చాయి.

సాధారణంగా ముల్లంగి దుంపలు 100 గ్రాములు నుంచి పావుకేజీ వరకు బరువు ఉంటాయి. యువ రైతు పాలవెల్లి పండించిన ముల్లంగి మాత్రం ఒక కేజీ నుంచి రెండు కేజీల బరువున్న దుంపలు దిగుబడి వచ్చాయి.

కష్టానికి తగిన ప్రతిఫలంగా.. ముల్లంగి పంట రెండింతలు దిగుబడికి రావడం చాలా ఆనందంగా ఉందని రైతు అంటున్నారు. యువ రైతు పాలవెల్లి పండించిన ముల్లంగి దుంపలను గ్రామానికి చెందిన తోటి రైతులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదీ చదవండి: ఫిట్మెంట్ పేరుతో ఊరించి.. ఉసూరుమనిపించారు: సంజయ్