ETV Bharat / state

భోగభాగ్యాలు తీసుకువచ్చే భోగి - మంటలు వేసేటప్పుడు ఇవి పాటించడం మర్చిపోకండి

Bhogi Festival Importance 2024 : సంక్రాంతి పండుగ వచ్చిందనగానే భోగి మంటలు, హరిదాసు, ముగ్గులు, రేగుపళ్లు, ఆటపాటలు, గాలిపటాలు ఇలాంటివి గుర్తుకు వస్తాయి. అయితే పండుగ స్టార్ట్​ అయ్యేదే భోగి మంటలతో. మరి ఆ భోగి రోజు ఎందుకు మంటలు వేస్తారో, దాని వల్ల లాభం ఏముంది? సినిమాల్లో ఓ సంబురంలా చూపించే భోగి వేడుకలు నిజంగా అలాగే జరుగుతాయా? ఇలాంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Bhogi Festival Process
Bhogi Festival Importance 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 5:03 PM IST

Bhogi Festival Importance 2024 : ధనుర్మాసంలో వచ్చే భోగికి భోగి పర్వం, భోగభాగ్యాలను తీసుకువచ్చే పండుగ అని పేరు. ఈ పండుగ వస్తుందంటే రెండు రోజుల ముందే చిన్న, పెద్ద అందరూ కలిసి మంట వేసేందుకు కలప గురించి ఎలా అని ఆలోచించడం మొదలుపెడతారు. ఊరు శివారు ప్రాంతంలో పాత పడిన కర్రలను తీసుకువస్తారు. సేకరించిన తరవాత పండుగ ముందు రోజు రాత్రికి అన్ని సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున అందరూ నిద్ర లేచి, నలుగు పిండితో స్నానం చేసి భోగి మంటను వేస్తారు.

Bhogi Festival Process : భోగి మంటల దగ్గరకు పెద్దలు, చిన్నవారు వచ్చి చలి మంట కాచుకుంటారు. మరికొందరు గొబ్బెమ్మలను, పిడకలను వేస్తారు. మంటలు పెద్దవిగా రావడానికి మామిడి, రావి, మేడి తదితర ఔషధ మొక్కల ఆకులను వేస్తారు. మంటల్లో కాలిన ఆ ఔషధ మొక్కల గాలి పీల్చిడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో మనసు ప్రశాంతగా మారి మనలో ఉన్న చెడు లక్షణాలు, అలవాట్లు వదిలేస్తామని పూర్వికుల భావన. కానీ ప్రస్తుతం అందరూ ముందు రోజు వాహనాల టైర్లు సంపాదించి మంటలను వేస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, వాతావరణానికి కూడా హానికరం. ఈసారైన మంటల్లో టైర్లు వాడకుండా ఉండేలా చూడండి.

డ్యాన్స్​లోనూ తగ్గేదేలే అంటున్న మంత్రి అంబటి రాంబాబు

ఇంకా భోగి మంటల్లో ఇంట్లో ఉండే పాత వస్తువులు మంటల్లో వేస్తాం. వాటిల్లో ఉండే చెదలు లాంటి పురుగులతో మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ సంప్రదాయాన్ని పెద్దలు తీసుకువచ్చారు. ఇక తెల్లవారిన తర్వాత చిన్న పిల్లల సందడి మొదలవుతుంది. ఎందుకో తెలుసా రేగుపళ్లతో చిన్నారులకు దిష్టి తీస్తారు. ఐదు సంవత్సరాల్లోపు ఉండే పిల్లలకు ముత్తైదులందరూ రేగుపళ్లు, చెరుకు ముక్కలు, బంతి పూల రెక్కలు, చాక్లెట్​లు పెట్టి దిష్టి తీస్తారు. దీంతో వాటిని తీసుకునేందుకు పిల్లలందరూ సంతోషంగా వారికి నచ్చింది తీసుకుంటారు. రేగుపళ్లే ఎందుకుంటే సాక్షాత్తు నారాయణుడే రేగు చెట్టు కింద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు చేశాడని చెబుతారు. దీనికి ప్రతీకగా పిల్లలను నారాయణుడుగా భావించి రేగుపళ్లు వేసే సంప్రాదాయం వచ్చింది.

భోగి పండగ వేళ వాట్సాప్ స్టేటస్​గా ఈ కోట్స్​ ట్రై చేయండి - సూపర్​ అనాల్సిందే!

Bhogi Pallu Story : ఐదేళ్లలోపు పిల్లలకే ఈ భోగి పళ్లు(రేగుపళ్లు) ఎందుకు వేస్తారంటే వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి ఈ పళ్లు అమృతంగా పని చేస్తాయి. ఎందుకంటే ఇందులో విటమిన్​ 'సి' ఉంటుంది. పళ్లు తలపై నుంచి వేయడం వల్ల శిరస్సులో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమైన జ్ఞానం పెరుగుతుందని పెద్దల భావన. పళ్లతో పాటు బంతిపూల రెక్కలు వేస్తారు. ఎందుకంటే క్రిమికీటకాలు దరిచేరవని, ఎలా అంటే బంతిపూల ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే. దీంతో పాటు ఇవి చర్మానికి తగలడం వలన చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

భోగి మంటల అర్థం, పరమార్థం ఏంటీ..?

శిల్పారామంలో సంక్రాంతి సంబరం భాగ్యనగరంలో కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.