ర్యాలీలో పాల్గొన్న స్వేరోస్ ప్రతినిధులు, విద్యార్థులు విజ్ఞానం, ఆరోగ్యం, సన్మార్గమే లక్ష్య సాధనగా స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమ్‌దీక్షను హైదరాబాద్‌లో ప్రారంభించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు కార్యక్రమం జరుగనుంది. స్వేరోస్ ప్రతినిధులు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ద విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరారు. అక్కడ ఐఏఎస్ అధికారులు, ప్రతినిధులు, విద్యార్థులు దీక్ష చేపట్టారు.
కులానికి సంబంధించింది కాదు
కాన్షీరామ్ జయంతి నుంచి భీమ్‌దీక్షను ప్రారంభించి నెల రోజుల పాటు పవిత్రమాసం అచరించనున్నట్లు ఐఏఎస్ అధికారి మురళి తెలిపారు. దీక్ష ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదని అన్నారు.
మంచి మార్గంలో నడవాలి
సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలన్నదే తమ ఉద్దేశమని స్వేరోస్ ప్రతినిధి రాజన్న తెలిపారు. పుస్తక పఠనం, వ్యాయామం చేయనున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి :సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!