Tourists at Bhavani Island : విజయవాడలోని భవానీ ద్వీపం పర్యాటక ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. కొవిడ్ కారణంగా గత మూడేళ్లుగా భవానీ ద్వీపానికి పర్యాటకుల రాక తగ్గింది. ఇటీవల కాలంలో కృష్ణా నదికి వరుసగా వరదలు రావటం వల్ల ఈ ద్వీపం పర్యాటకులకు దురమైంది. ప్రస్తుతం కృష్ణా నదికి వరదలు తగ్గుముఖం పట్టడం, కార్తికమాసం.. సందర్భంగా భవానీ ద్వీపానికి అధికారులు పర్యాటకులను అనుమతిస్తున్నారు. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణం చేసేందుకు పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.
భవానీ ద్వీపంలో పిల్లలు ఆడుకోవడానికి అనేక ఆట పరికరాలున్నాయి. యువత కోసం సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. సెల్పీలు తీసుకునేందుకు ప్రత్యేకంగా భారతదేశ ఆకారంతో కూడిన చిహ్నం, కుందేళ్లు, లేడి బొమ్మలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భవానీ ద్వీపాన్ని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముందని..స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: