ETV Bharat / state

Bhatti Vikramarka Latest News : 'ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్ పార్టీ పేటెంట్' - భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర

Bhatti Vikramarka fires on BRS : ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కాంగ్రెస్‌ న్యాయం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుతున్న సాగునీరంతా కాంగ్రెస్ చలవేనని పునరుద్ఘాటించారు. ఇందిరా భవన్‌లో ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన.. తన పాదయాత్ర అనుభవాలను పంచుకున్నారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka
author img

By

Published : Jul 15, 2023, 4:11 PM IST

Updated : Jul 15, 2023, 6:10 PM IST

Bhatti Vikramarka comments on free electricity for farmers : ప్రజల అవసరాలే కాంగ్రెస్ పార్టీ అజెండా అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వెల్లడించారు. ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అన్న భట్టి.. మరొకరికి దీనిపై మాట్లాడే హక్కులేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తెలంగాణ రాష్ట్రానికి 53 శాతానికిపైగా విద్యుత్ కేటాయింపు జరిగిందని వివరించారు. పీపుల్స్ మార్చ్‌ పేరుతో 109 రోజులపాటు 1364 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన బట్టి విక్రమార్క ఇవాళ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన తన పాదయాత్ర జులై 2న ఖమ్మంలో ముగిసిందని తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాలతో నిర్వహించిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. అడుగడుగునా ప్రజలు తమ ఇబ్బందులను తనకు తెలియజేశారని వివరించారు. రాష్ట్రంలో పేదలకు, ధనికులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అంతరాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృషి చేసిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అది జరగడం లేదని ఆరోపించారు.

Bhatti vikramamarka on Telangana projects : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆస్తులు లేని ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున సంపాదించుకున్నారని.. ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పంటలకు అందుతున్న సాగునీరంతా కూడా కాంగ్రెస్‌ హయంలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచేనని వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయంలో నిర్మించిన ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా అందడం లేదని ఆరోపించారు.

దాదాపు 52 నిమిషాల పాటు తన పాదయాత్ర అనుభవాలను మీడియాకు వివరించిన బట్టి విక్రమార్క.. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని వెల్లడించారు. దానిని ప్రైవేట్ పరం కాకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు అప్రస్తుతమని.. ఇందిరమ్మ పాలన తీసుకురావడమే తమ ఏజెండగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యచరణను వివరించారు. ప్రాజెక్టులను సందర్శించి అక్కడ సెల్ఫీలు తీసుకుంటామని.. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు, ఖర్చు, ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.

"ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. విద్యుత్ విషయంలో తెలంగాణకు కాంగ్రెస్‌ న్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారమే 53 శాతం విద్యుత్‌ కేటాయించింది. 9 ఏళ్లల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భారీగా సంపాదించారు. రాష్ట్రంలో అందుతున్న సాగునీరంత కాంగ్రెస్ చలవే. కాంగ్రెస్‌ నిర్మించిన ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతోంది. కొత్తగా కట్టిన ప్రాజెక్టు నుంచి ఎకరం భూమికి నీరు అందలేదు. సీఎం కుర్చీలో ఎవ్వరు ఉంటారన్నది ఇప్పుడు ముఖ్యం కాదు." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

'ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్ పార్టీ పేటెంట్'

ఇవీ చదవండి:

Last Updated : Jul 15, 2023, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.