బోయిన్పల్లి అపహరణ కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ హైకోర్టును ఆశ్రయించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షంగా ఉన్నందున అధికార పార్టీలు తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని పిటిషన్లో భార్గవ్ రామ్ పేర్కొన్నారు. తనకు సంబంధం లేకపోయినప్పటికీ కేసులో ఇరికించారని ఆరోపించారు.
అఖిలప్రియ నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ప్రయోజనాల కోసం తనను కేసులో పెట్టారన్నారు. మొదట ఏవీ సుబ్బారెడ్డి ఏ2 అని పేర్కొన్నారని.. ఆ తర్వాత తనను ఏ2గా చిత్రీకరించారని భార్గవ్ రామ్ ఆరోపించారు.
ఈ కేసులో అఖిలప్రియ సహా 18 మందిని ఇప్పటికే అరెస్టు చేశారన్నారు. తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో వివరించారు. పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.