ETV Bharat / state

BHARAT BIOTECH: లేగదూడ సీరం వాడారనే ఆరోపణల్లో వాస్తవం లేదు..

కొవాగ్జిన్ తయారీ ప్రక్రియలో ఎక్కడా లేగదూడ సీరం వాడలేదని భారత్​ బయోటెక్​ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ స్పందించింది.

author img

By

Published : Jun 16, 2021, 7:20 PM IST

BHARAT BIOTECH
లేగదూడ సీరం వాడారనే ఆరోపణల్లో వాస్తవం లేదు..

కొవాగ్జిన్​ తయారీలో కొత్తగా పుట్టిన దూడ సీరం వాడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ స్పందించింది. వ్యాక్సిన్ల తయారీలో కొత్తగా పుట్టిన దూడ సీరం వాడతారన్న మాట నిజమే అయినప్పటికీ కొవిడ్ వ్యాక్సిన్​లో వీటిని వినియోగించటం లేదని స్పష్టం చేసింది. లేగదూడ సీరం వాడారనే ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.

సాధారణంగా వైరస్ కణాల పెరుగుదల కోసం ఈ సీరంని వినియోగిస్తారని ప్రకటించిన భారత్ బయోటెక్... కొవిడ్ వ్యాక్సిన్ల తయారీలో మాత్రం ఏ ఒక్క దశలోనూ దూడ సీరం వినియోగించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్​లో నిష్క్రియ చేసిన వైరస్​ని మాత్రమే వినియోగించినట్టు ప్రకటించింది.

ఇదీ చదవండి: సాధారణ జలుబు‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.