ETV Bharat / state

భారత్​ బంద్​ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు రైతులు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల తెరాస, కాంగ్రెస్​, తెదేపా, వామపక్ష నాయకుల మధ్య తోపులాట జరిగింది. రైతులు చేపట్టిన బంద్‌లో అఖిలపక్షాలు పూర్తిస్థాయిలో పాల్గొన్నాయి.

భారత్​ బంద్​ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు
భారత్​ బంద్​ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు
author img

By

Published : Dec 8, 2020, 5:24 PM IST

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్​ బంద్ కార్యక్రమంలో అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బంద్​లో భాగంగా కరీంనగర్ బస్టాండ్ ముందు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. తెరాస కార్మిక విభాగం అక్కడికి చేరుకోగానే కాంగ్రెస్, సీపీఐ సీపీఎం, తెదేపా నాయకులు వారిని అడ్డుకున్నారు. వారి మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు నాయకులను చెదరగొట్టారు.

కొప్పులను అడ్డుకున్న కాంగ్రెస్...

చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ కాన్వాయ్​ను కాంగ్రెస్​ నాయకులు అడ్డుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తోన్న సమయంలో మంత్రి కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. సన్నరకం వరి ధాన్యానికి రూ.2,500 రూపాయలు చెల్లించాలని కోరుతూ.. కాంగ్రెస్ నాయకులు కాన్వాయ్​కు అడ్డంగా రోడ్డుపై కూర్చుకున్నారు. పోలీసులు సర్ది చెప్పినప్పటికీ నినాదాలు చేశారు.

భువనగిరిలో ఉద్రిక్తత...

భారత్​బంద్​కు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్​, తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు భువనగిరి పట్టణంలో ఓ బేకరి షాప్​ను బంద్​ చేయించే క్రమంలో... రాళ్లు విసరగా ఓ రాయి అక్కడే ఉన్న భాజపా కార్యకర్తకు తగలింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

భాజపా, వామపక్ష కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు వచ్చి మూడు పార్టీల కార్యకర్తలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించేశారు.

కూకట్​పల్లిలో తోపులాట...

హైదరాబాద్​ కూకట్​పల్లి జాతీయ రహదారిపై రైతు దీక్షకు మద్దతుగా భారత్​ బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెరాస నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలను పక్కకు వెళ్లమని పోలీసులు చెప్పారు. వారిని పట్టించుకోకుండా రెండు గంటలకు పైగా... రోడ్డుపై బైఠాయించగా పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నంలో తెరాస నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపటికి పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని తెరాస నాయకులను అక్కడి నుంచి తరలించారు.

ఇదీ చూడండి: రైతన్నకు మద్దతుగా నిలిచిన రాష్ట్రం.. భారత్​ బంద్​ సంపూర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.