భాగ్యనగరంలోని జాహ్నవి కశాళాలలో విద్యార్థినులు సంప్రదాయం ఉట్టిపడేలా చీర కట్టులో అందంగా ముస్తాబై బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంతా కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్టు కళాశాల వైస్ ఛైర్మన్ లక్ష్మీ తెలిపారు. రోజువారి జీవితానికి భిన్నంగా కళాశాల అధ్యాపకులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేయడం ఆనందంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ఈఎస్ఐ కేసులో బయటపడుతున్న "ఓమ్ని" లీలలు