ETV Bharat / state

'వినాయక విగ్రహాల నిమజ్జనంను హుస్సేన్​సాగర్​లో చేసి తీరుతాం' - హైదరాబాద్ తాజా వార్తలు

వినాయక విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు తెలిపారు. అయితే విగ్రహాల నిమజ్జనాన్ని మాత్రం హుస్సేన్​సాగర్​లోనే చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని భగవంత్ రావు పేర్కొన్నారు.

భగవంత్ రావు
భగవంత్ రావు
author img

By

Published : Jul 22, 2022, 6:18 PM IST

వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని హుస్సేన్​సాగర్​లోనే చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని తెలిపారు. ఈ విషయంలో మండప నిర్వాహకులను వేధింపులకు గురి చేయవద్దన్నారు. ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్ల కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలని కోరారు.

మండప నిర్వాహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాల బద్దంగా వినాయకచవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. రేపు బాల గంగాధర్ తిలక్ 166వ జయంతి సందర్భంగా.. బేగంబజార్​లోని బాహేతి భవన్​లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు భగవంత్ రావు తెలియజేశారు.

అసలేం జరిగిదంటే: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై స్పష్టతనిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో విగ్రహాల తయారీపై నిషేధం లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో మాత్రం నిమజ్జనం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: ప్రియురాలి తల నరికి.. స్టేషన్​కు తీసుకెళ్లిన యువకుడు.. అందుకు ఒప్పుకోలేదనే!

SC on Kaleshwaram: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.