ETV Bharat / state

B Forms Tension in BRS MLA Candidates 2023 : సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు బీ ఫారమ్​ టెన్షన్​.. అభ్యర్థిత్వం ఖరారుపై సందిగ్ధత

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 8:00 AM IST

B Forms Tension in BRS MLA Candidates 2023 : బీఆర్ఎస్ పెండింగ్‌ స్థానాలతోపాటు.. అలంపూర్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అలంపూర్‌లో అభ్యర్థిని ప్రకటించినా.. ఇంకా బీఫారం ఇవ్వకపోవడంతో మారుస్తారేమోనన్న ప్రచారం సాగుతోంది. నర్సాపూర్‌లో సునీతాలక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తుండగా.. తనకే ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పట్టుబట్టుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని గోషామహల్, నాంపల్లిలో అభ్యర్థులను ఇంకా ఖరారుచేయకపోగా ఎమ్​ఐఎమ్​ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న ఏడు నియోజకవర్గాల్లో బీఫారాలను పెండింగ్‌లో పెట్టారు.

Ticket Issues in BRS Party
BForms Tension in BRS Sitting Candidates
BForms Tension in BRS Sitting Candidates సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు బీఫారమ్​ టెన్షన్​.. అభ్యర్థిత్వం ఖరారుపై సందిగ్ధత

B Forms Tension in BRS MLA Candidates 2023 : బీఆర్ఎస్ అభ్యర్థులకు దశలవారీగా బీఫారాలు ఇస్తున్నారు. ఈనెల 15 నుంచి నిన్నటి వరకు 108 మంది అభ్యర్థులకు కేసీఆర్(CM KCR) బీఫారాలు పంపిణీచేశారు. మరో 11 మందికి.. నేడో, రేపో ఇవ్వనున్నారు. సెంటిమెంట్ కారణంగా బీఫారం తీసుకోని సనత్‌నగర్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్‌యాదవ్.. నేడు బీఫారం తీసుకోనున్నారు. అయితే అలంపూర్ బీఫారం ఎవరికి దక్కనుందనే అంశంపై పార్టీవర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.

Alampur BRS MLA Ticket Issue 2023 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అభ్యర్థులందరికీ బీఫారాలు ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం.. అలంపూర్ అభ్యర్థికి ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. ఆగస్టు 21న ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. అలంపూర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు ప్రకటించగా.. ఆయన్ను మార్చాలని నియోజకవర్గంలో అసమ్మతి గుప్పుమంది. పలువురు నాయకులు కేటీఆర్, హరీశ్‌రావును కలిసి అబ్రహంను మార్చకపోతే.. పార్టీ అభ్యర్థిని గెలిపించబోమని అల్టిమేటం జారీచేశారు. నియోజకవర్గంలోని పరిస్థితిని.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ తరుణంలో.. అలంపూర్ బీఫారం పెండింగులో పెట్టడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఒకటి, రెండ్రోజులు ఆలస్యమైనా బీఫారం తనకేనని అబ్రహం.. ధీమాతో ఉన్నారు.

Telangana Assembly Elections 2023 : తనకు లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ మందాజగన్నాథం కోరుతున్నారు. అనుచరుడికే టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పట్టుబట్టుతున్నారు. తెలంగాణ భవన్‌లో దివ్యాంగుల సభకు హాజరైన కేటీఆర్​ను కలిసేందుకు అబ్రహం, మందా జగన్నాథం యత్నించారు. ప్రకటించిన అబ్రహంకే బీఫారం దక్కుతుందా.. లేదా అధిష్ఠానం నిర్ణయం మార్చుకుంటుందా అనే విషయంపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

CM KCR Meeting with BRS MLA Candidates : 51 మందికి బీ ఫారాలు.. అందరినీ కలుపుకుని పోవాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచన

జనగామలో పల్లారాజేశ్వర్ రెడ్డికి, మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్‌రెడ్డికి నేరుగా బీ ఫారాలు ఇచ్చేశారు. నర్సాపూర్‌లో మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డికి ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. తనకే ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి పట్టుబట్టుతున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడినా.. మదన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. స్వయంగా కేసీఆర్ చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

BRS MLA Ticket B Forms Telangana : హైదరాబాద్ పాతబస్తీలో ఎమ్​ఐఎమ్​ ప్రాబల్యం ఉన్న ఎనిమిది స్థానాలపైనా బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. గోషామహల్, నాంపల్లి అభ్యర్థులని ఇంకా ఖరారు చేయలేదు. ఎమ్​ఐఎమ్​తో చర్చల తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. గోషామహల్‌లో బీజేపీ నుంచి రాజాసింగ్, విక్రమ్‌గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ప్రకటన తర్వాతే.. గోషామహల్‌పై బీఆర్ఎస్ నిర్ణం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇతర పార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్త నేతలకు అవకాశం దక్కవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. నాంపల్లిలో అభ్యర్థినీ ఇంకా ఎమ్​ఐఎమ్​ ఖరారు చేయలేదు. అయితే అక్కడ నుంచి అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్యే ప్రధానపోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఎమ్​ఐఎమ్​కి లాభం కలిగించేలా.. లోపాయికారీ చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం వినిపిస్తోంది.

CM KCR Election Campaign Schedule 2023 : 110 నియోజకవర్గాలు.. 17 రోజులు.. 41 సభలు.. ఉద్ధృత ప్రచారానికి సీఎం కేసీఆర్ సన్నాహాలు

CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha : 'కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.