Benefits of Almonds in Telugu : డ్రైఫ్రూట్స్ విషయంలో చాలమందికి రకరకాల ఆపోహలుంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని.. లావుగా అవుతామని అనుకుంటారు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని భావిస్తారు. కానీ బాదం విషయానికి వస్తే అవన్ని అపోహలు సరికాదంటున్నారు నిపుణులు. అంతే కాకుండా వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా... శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మోనో అన్శ్యూచురేటెడ్ కొవ్వులు, మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయని అంటున్నారు.
Eating Almond Reduces Weight : మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే క్రమం తప్పకుండా తినేవారికి 35 శాతం తక్కువ గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణం వాటిలో తక్కువ మొత్తంలో ఉండే క్యాలరీలు. విటమిన్ 'ఇ', పీచు వంటి ఎన్నో పోషకాలు ఉన్న బాదం పప్పు బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుకుందామా..?
Spices For Weight Loss : బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ సుగంధ ద్రవ్యాలను ట్రై చేయండి!
కొందరికి సాయంత్రం పూట స్నాక్స్ తినందే మనసుపట్టదు. అందుకు వారు ఆ సమయంలో నచ్చినవేవో చేసుకోవడమో లేదా బయటికి వెళ్లి కొనుక్కొని తింటుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు. కాబట్టి వీటన్నింటికి బదులు గుప్పెడు బాదం పప్పు తినడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇందులో తక్కువగా ఉండే క్యాలరీల వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే ఇందులో అధికంగా ఉండే పీచు వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది.. చాలా సమయం వరకు ఆకలి కాకుండా ఉంటుందట.
Salty Food Health Problems : ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా?.. మధుమేహం ముప్పు పొంచి ఉన్నట్లే!
స్నాక్స్‌లో కూడా: ఉప్మా, ఓట్మీల్, కిచిడీ, నూడుల్స్.. వంటి బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం పప్పును వేయడం లేదా.. అల్పాహారం పూర్తయిన తర్వాత కొన్ని బాదం పప్పుల్ని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో చాలాసేపటి వరకు ఆకలి అనిపించకుండా ఉంటుంది. పొట్ట తగ్గించుకోటానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. దాంతోపాటు రోజు బాదంపప్పు తినడం అలవాటు చేసుకుంటే పొట్ట భాగంలో పెరిగిపోయిన కొవ్వుల్ని తగ్గించుకోవచ్చు. దీనికి ఇందులో అధిక మొత్తంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ కొవ్వులే ముఖ్యకారణం. ఇవి శరీరంలో పేరకుపోయన కొవ్వు నిల్వలపై దాడి చేసి దాన్ని మెల్లిగా తగ్గించేస్తాయి.
ఎలా తిన్నా ఏంకాదు : బాదం పప్పును కేవలం నానబెట్టుకొనే తినాలని లేదు. నూనె లేకుండా వేయించి తిన్నా, నానబెట్టి తిన్నా, నేరుగా తిన్నా, ఎలా తీసుకున్నా వాటిలోని క్యాలరీలు ఎక్కువ తక్కువ అలా ఏమీ ఉండవు. కాబట్టి ఎలాంటి సంకోచాలు లేకుండా పప్పుని ఈ మూడు పద్ధతుల్లో తినొచ్చు.
దీనివల్ల కలిగే లాభాలు :
- బాదంపప్పులోని మెగ్నీషియం రక్తంలోని షుగర్‌ని అదుపు చేస్తుంది. దీనివల్ల ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది.
- శరీరంలోని చెడు కొవ్వుల్ని తగ్గించి.. మంచి కొవ్వుల్ని పెంచే శక్తి బాదం పప్పుకి మెండుగా ఉంది. దీనివల్ల బరువు అదుపులో ఉండడంతోపాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
- రాత్రంతా నానబెట్టిన బాదం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. మన ఆహారం ద్వారా పెరిగిన కొవ్వులు కరిగేందుకు ఇది దోహదం చేస్తుంది.
High Protein Diet Health Benefits : హై ప్రోటీన్ ఫుడ్‌తో.. స్థూలకాయం సహా.. బీపీ, షుగర్లకు చెక్!