హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన మూడో ఇరిగేషన్ దివోత్సవానికి రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఏ చెరువులో ఎంత నీరు లభ్యమవుతుంది అనే రికార్డులతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్కు అవగాహన ఉందని ఆయన అన్నారు.
అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సీఎం చేస్తున్న కృషిని ప్రతిఒక్కరు అభినందించాలని గుత్తా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు చేయూతనిచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో సహకారాన్ని అందజేయాలని ఇంజినీర్లను కోరారు.
ఇదీ చూడండి : ఆ ఒక్కటి పక్కనబెడతాం.. మిగతావి పరిష్కరించండి