ETV Bharat / state

అప్రమత్తంగా ఉండాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశం - వర్షాలపై పోలీసులకు డీజీపీ ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశం

author img

By

Published : Aug 16, 2020, 10:33 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. రెండు రోజుల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలసి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సూచనలు, సలహాలను ఇస్తున్నామని డీజీపీ తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంతో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించామన్నారు. కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని... క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.