ETV Bharat / state

Telangana BCs Rs 1 Lakh Scheme : నేటితో గడువు ముగిసింది.. ఇన్​కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు మాత్రం అందలేదు.. - తెలంగాణలోని బీసీలకు రూ1 లక్ష ఆర్థిక సాయం

BCs Welfare Scheme In Telangana : దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీసీలకు లక్ష రూపాయలు సాయం ప్రక్రియలో దరఖాస్తుదారులు అష్టకష్టాలు పడుతున్నారు. 14రోజుల క్రితం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి దరఖాస్తు కోసం కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా.. వాటికోసం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తుండగా.. తీరా ధ్రువపత్రాలు తెచ్చాక సర్వస్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగుతున్నారు.

BCs Rs 1 Lakh Scheme
BCs Rs 1 Lakh Scheme
author img

By

Published : Jun 20, 2023, 10:32 PM IST

BCs Rs 1 Lakh Scheme In Telangana : బీసీలలోని కులవృత్తులు, చేతి వృత్తుల వారి కోసం ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుండగా.. అందుకు కావాల్సిన కుల, ఆదాయ ధ్రువ పత్రాలు జత చేయాల్సి వస్తోంది. దీంతో 15రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్‌ కార్యాలయాలు లబ్ధిదారులతో కిక్కిరిసి పోతున్నాయి.

Rs 1 Lakh To BCs In Telangana : ఆయా కులవృత్తుల వారిలో అత్యధికులకు ఈ ధ్రువపత్రాలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కేవలం విద్య, ఉద్యోగానికి సంబంధించి మాత్రమే విద్యార్థులు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బీసీ వర్గాల వారంతా దరఖాస్తుల కోసం కావాల్సిన పత్రాల గురించి.. తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుంది. దీనితో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. దానికితోడు పాఠశాలలు ప్రారంభం కావడంతో పిల్లల ప్రవేశాల కోసం కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు రావడంలో జాప్యం జరుగుతోంది. ఒకేసారి ధ్రువీకరణ పత్రాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో.. రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Rs 1 Lakh To BCs Community In Telangana Last Date : తహశీల్దార్‌ కార్యాలయాల్లోనూ ఆన్‌లైన్‌ సమస్య కారణంగా తొలి నుంచి ఈ ప్రక్రియ సాఫీగా సాగలేదు. సాయంత్రం నుంచి రాత్రి వరకు సిబ్బంది ఉండి జారీ చేయాల్సి వచ్చింది. ఇటు మీ-సేవా కేంద్రాల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. ఇవాళే చివరి రోజు కావటంతో తహశీల్దార్‌ కార్యాలయాలు, మీసేవల వద్ద బారులు తీరారు. మీ-సేవ కేంద్రాల్లో రద్దీ పెరగడంతో సర్వర్‌ సమస్య తలెత్తుతోంది. గంటలకొద్ది కేంద్రాల వద్ద వేచి ఉంటున్నారు. ధ్రువీకరణపత్రాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని తహశీల్దార్‌ కార్యాలయం నుంచి పొందాల్సి ఉండటంతో.. తీవ్ర కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు ఈరోజుతో ముగిస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

"ఎమ్మార్వోతో సంతకం చేయించుకున్న తర్వాత మీ సేవ దగ్గరకు వస్తే సర్వర్‌ బిజీ అని చెపుతున్నారు. మా పిల్లలను, పనులను మానుకొని ఈ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాము. కూలీ పనులు చేసుకొని బతికేవాళ్లం. వారం పదిరోజుల నుంచి వస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. గడువు ముగుస్తుంది కాబట్టి ప్రభుత్వం గడువును పెంచాలి." - లబ్ధిదారులు

నేటితో గడువు ముగిసింది.. ఇన్​కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు మాత్రం అందలేదు..

Telangana BCs Scheme Rs1 Lakh 2023 : పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నందున గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వారం పదిరోజులుగా.. కూలిపనులు పక్కనపెట్టి కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా... ధ్రువపత్రాలు ఇవ్వటంలేదంటూ చాలా చోట్ల ఎమ్మార్వో కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. డబ్బులు ఇచ్చిన వారికి ఒక్కరోజులోనే ధ్రువీకరణ పత్రాలు అందుతున్నాయని.. మిగిలివారు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుందని.. ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.