ETV Bharat / state

Krishnaiah Meet Minister: బడ్జెట్​లో బీసీలకు పదివేల కోట్లు కేటాయించాలి: ఆర్.కృష్ణయ్య - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

రానున్న బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​కు వినతిపత్రం సమర్పించారు.

Krishnaiah Meet Minister
మంత్రి గంగుల కమలాకర్​కు వినతిపత్రం సమర్పిస్తున్న బీసీ సంఘం నేతలు
author img

By

Published : Mar 5, 2022, 4:46 PM IST

బడ్జెట్​లో బీసీలకు ప్రతి ఏటా అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఈ నెల 7నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​కు 14 డిమాండ్లతో కూడిన​ వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 10 వేల కోట్ల రూపాయలను కేటాయించే విధంగా కృషి చేయాలని మంత్రిని కోరారు. మంత్రితో పలు అంశాలపై చర్చలు జరిపారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్​కు సబ్సిడీ రుణాల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్​కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్​కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని తెలిపారు. పెండింగ్​లో ఉన్న 5 లక్షల 37 వేల మందికి రుణాలు మంజూరు చేయాలన్నారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని ఐఐటీ, ఐఐఎం, ఎన్​ఐటీ కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని మంత్రిని కోరారు. అనంతరం ఇదే డిమాండ్లతో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్​ను కలిశారు.

రాష్ట్రంలో బీసీల సమస్యలపై మంత్రి గుంగుల కమలాకర్​తో చర్చించాం. రానున్న బడ్జెట్​లో కేటాయింపులు పెంచాలి. బీసీలకు ఎక్కడా రుణాలు ఇవ్వడం లేదు. రుణాల కోసం తిరుగుతున్నా కూడా అతీగతీ లేదు. పెండింగ్​లో ఉన్న రుణాలన్నింటినీ విడుదల చేయాలి. బీసీ సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్​కు రూ.3 వేల కోట్లు ఇవ్వాలి. స్కాలర్​షిప్​లు, మెస్​ ఛార్జీలు కూడా పెంచాలి. ఇంటర్ క్యాస్ట్​ మ్యారేజ్​ చేసుకునే వారికి రూ.2.5 లక్షలకు పెంచాలి. బీసీ సంక్షేమాల పథకాల మీద ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశారా?

- ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.