రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అన్ని ప్రభుత్వ శాఖల కీలకమైన పదవులను పదవీ విరమణ పొందిన అగ్రవర్గాల ఉద్యోగులకు కట్టబెట్టి వెనుకబడిన తరగుతుల ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్లో సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల అర్హత ఉన్న బలహీన వర్గాల ఉద్యోగులు పదోన్నతులు పొందలేక అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రిటైర్డు అయిన ఉద్యోగిని ఆరు నెలల పాటు కొనసాగించవచ్చునని సడలింపు ఉన్నప్పటికీ .. రాజ్యాంగ అధికరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కి ఆరేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులను కీలక పదవుల్లో కొనసాగిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్ల నిరుద్యోగ యువతతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని పదవీ కాలం ముగిసిన ఉద్యోగులను తొలగించి.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం