బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలలో బీసీలకు జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్లు 33 శాతం నుంచి 42 శాతానికి పెంచిన అనంతరం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్... బీసీ రిజర్వేషన్లు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు.
తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్... అనేక వేదికలపై ప్రకటించారని గుర్తుచేశారు. ప్రభుత్వం వాగ్ధానం చేసిన విధంగా రిజర్వేషన్లు పెంచిన అనంతరమే ఎన్నికలు నిర్వహించాలని లేనిపక్షంలో న్యాయ పోరాటంతో పాటు ఎలక్షన్ కమిషన్, జీహెచ్ఎంసీ కార్యాలయాలను ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'జనవరి వరకు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి'