ETV Bharat / state

R Krishnaiah: బీసీ సాధికారత పథకం ప్రవేశపెట్టాలి: ఆర్ కృష్ణయ్య

author img

By

Published : Jul 13, 2021, 6:44 PM IST

బీసీల సాధికారతకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీలు రాజ్యాధికారం సాధించినప్పుడే అన్ని రంగాల్లో రాణించవచ్చునని చెప్పారు. మంగళవారం నాచారంలోని ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని.. బీసీ సంఘం నాయకులతో కలిసి సందర్శించారు.

R krishnaiah
ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్​ నాచారంలోని ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని.. బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) సందర్శించారు. బీసీల సాధికారతకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు రాజ్యాధికారం సాధించినప్పుడే అన్ని రంగాల్లో రాణించవచ్చునని చెప్పారు. ఆ దిశగా బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలి

దళితుల సాధికారత ప్రత్యేక పథకం.. ప్రవేశపెట్టి నిరుపేద ఎస్సీలకు 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్... ఆ విధంగానే నిరుపేద బీసీలు కూడా బీసీ సాధికారత పథకం ప్రవేశపెట్టి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలోని బీసీ కులాల 12 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చి ఛైర్మన్లను, పాలకమండలి సభ్యులను నియమించి, బడ్జెట్ కేటాయించాలన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

బీసీ కార్పొరేషన్ కింద రుణాల మంజూరుకు అర్హులైన 5 లక్షల 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పటివరకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయలేదని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచాలని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగెళ్లమూడి నందగోపాల్, బీసీ నేతలు అరవింద్ జగదీశ్​ కుమార్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Bhatti: అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: సీఎల్పీ నేత భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.