ETV Bharat / state

'కొలువులన్నీ భర్తీ చేయకపోతే ఏ మంత్రిని రోడ్లపై తిరగనివ్వరు'

వివిధ ప్రభుత్వశాఖల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య అన్నారు. అయితే కొన్ని శాఖల్లోనే కాకుండా మొత్తం ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కారు ముందుకు రావాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Dec 14, 2020, 8:00 PM IST

'కొలువులన్నీ భర్తీ చేయకపోతే ఏ మంత్రిని రోడ్లపై తిరగనివ్వరు'
'కొలువులన్నీ భర్తీ చేయకపోతే ఏ మంత్రిని రోడ్లపై తిరగనివ్వరు'

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం కొలువులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య డిమాండ్​ చేశారు. కేవలం ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలనే భర్తీ చేస్తామని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. వాస్తవంగా 45 ప్రభుత్వశాఖల్లో రెండు లక్షల 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటన్నింటినీ భర్తీ చేయకపోతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని... ఏ ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేని రోడ్లపై తిరగకుండా ఎక్కడికక్కడ ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.

పదవీ విరమణ ద్వారా ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల వాటికి కేటాయించిన బడ్జెట్​ మిగిలిపోతోందన్నారు. ఆ మొత్తాన్ని ఇతర సేవలకు మళ్లిస్తున్నారని.. ఇలా వేల కోట్ల బడ్జెట్ మిగుల్చుకోడానికి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో నిరుద్యోగ జాక్ ఛైర్మన్ నీల వెంకటేశ్​, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీ కోట్ల శ్రీనివాస్, గుజ్జ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నియామక ప్రక్రియ వేగవంతం.. ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.