బడుగు బలహీన వర్గాలకు విద్యనందించాలనే లక్ష్యంతో తన 14వ ఏటానే విద్యా సంస్థను ఏర్పాటు చేసి... పేదలకు విద్యనందించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సభకు హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువకులంతా మంచి మార్గాన్ని ఎంచుకొని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఈ సభకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజయ్యారు.
ఇవీ చూడండి:భాగ్యనగరంలో ఒక్క నవంబర్లోనే 15 హత్యలు