రిజర్వేషన్లు లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఎలా ఆమోదిస్తారని బీసీ విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను వ్యాపారం చేయడానికి ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు దాసోహం అయిందని విద్యార్థి నేతలు మండిపడ్డారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..
రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింపచేయడాన్ని బీసీలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కోఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్ స్పష్టం చేశారు.
తక్షణమే రిజర్వేషన్లు కల్పించాలి..
తక్షణమే బిల్లును సవరించి ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు గొడుగు మహేష్ యాదవ్, పాలకూర్ల మహేష్ గౌడ్, కట్ట హరికృష్ణ, అశోక్, అత్మరవ్, రాజు, ఉపెందర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.