రాష్ట్రంలోని ఊరూవాడ బతుకమ్మ పూల పండుగకు ముస్తాబవుతోంది. కరీంనగర్లో చిన్నాపెద్దా తేడా లేకుండా ఆటపాటలతో ఆనందోత్సవాల నడుమ బతుకమ్మ సంబురాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. చలికాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులను అరికట్టడానికి ఈ పూలలో మంచి ఔషద గుణాలు ఉన్నాయంటూ వాటిని ఆరాధిస్తున్నామని మహిళలు చెప్తున్నారు. రకరకాల పూలను పేర్చి గౌరమ్మను చేసి సౌభాగ్యాన్ని ఇవ్వమంటూ ఆడపడుచులు సంప్రదాయ వస్త్రాలంకరణతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు.
ఇవీచూడండి: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...