భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన పండగలను ప్రజలు సమైక్యంగా నిర్వహించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛత పాటిస్తూ.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. బతుకమ్మ పండుగ పురస్కరించుకుని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ.. ముందుకు సాగాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తామంటూ ప్రజల చేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చూడండి : ఇంటిబాట పట్టిన నగర వాసులు