ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. హైదరాబాద్ హిమయత్ నగర్‌లోని బీసీ భవన్‌లో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.
బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సారయ్య చేతి వృత్తి నిపుణులైన 25 మందికి సేవా అవార్డ్‌లను ప్రదానం చేశారు. అవార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరూ వారివారి సామాజిక వర్గాల అభివృద్ధి కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చెయ్యాలని సూచించారు. రాజకీయంగా ఎదగడానికి ఐక్యమత్యంతో పాటుగా వారివారి కుల పెద్దలతో కలిసి ముందుకు సాగాలని తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేసినట్లుగానే తెలంగాణాలో కూడా బెస్తా కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మౌనం వీడి మహాపోరాటం చేయాలి : ఆర్.కృష్ణయ్య