liquor stores in hyd: హనుమాన్ జయంతి సందర్భంగా నేడు భాగ్యనగరంలో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇవాళ ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు జరగనుందని వెల్లడించారు. శోభాయాత్ర ఏర్పాట్లను సీవీ ఆనంద్ పరిశీలించారు.
వీర హనుమాన్ విజయ యాత్ర ద్విచక్ర వాహన ర్యాలీ రూట్ మ్యాప్‌ను సంబంధిత పోలీసు అధికారులను, నిర్వాహకులను సీపీ అడిగి తెలుసుకున్నారు. భజరంగ్ దళ్, వీహెచ్‌పీ నాయకులతో కలిసి తాడ్‌బండ్ వరకు చేరుకుని యాత్ర ఏర్పాట్లపై ఆరా తీశారు. అంతకు ముందు సీపీతో పాటు నగర జాయింట్ సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్, సీఐలు రవీందర్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి, బిక్షపతి రాంమందిర్‌లో పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి..