ETV Bharat / state

మహిళ అవయవదానం.. 15 సంవత్సరాల బాలుడి జీవితంలో వెలుగులు - పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్

ORGAN DONATION: గుండె.. కాలేయం.. కళ్లు.. కిడ్నీలు.. ఇలా ముఖ్య అవయవాల కోసం నిరీక్షిస్తున్న వారెందరో ఉన్నారు. మనం చనిపోయిన కూడా మరొకరికి పునఃజన్మ ఇవ్వడానికి మేమున్నామంటూ ముందుకొచ్చి దానం చేస్తున్నారు. అలాగే తాజాగా చనిపోయిన ఓ మహిళ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో ఆదర్శప్రాయమైంది.

ORGAN DONATION
ORGAN DONATION
author img

By

Published : Jan 20, 2023, 5:26 PM IST

ORGAN DONATION: చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసే దాతల పెద్దమనసు పలువురు బాధితులకు వరంగా మారుతోంది. శరీరంలోని అవయవాల మార్పిడి ద్వారా రోగి ప్రాణాలనూ కాపాడుతోంది. సామాజిక స్పృహ కలిగిన కొద్ది మంది తమ మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆప్తులు మరణ అంచుల్లో ఉన్నప్పటికీ మరికొందరు.. పరుల మేలు ఆలోచించి.. పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. తాజాగా బ్రైయిన్​ డెడ్​ అయిన చనిపోయిన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం.. మరో బాలుడి జీవితాల్లో వెలుగులు నింపనుంది.

ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్​ విశాఖలో రోడ్డు ప్రమాదానికి గురైన సన్యాసమ్మ(48) అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మహిళ గుండెను తిరుపతి పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అక్కడ నుంచి గ్రీన్‍ ఛానల్‍ ద్వారా ఎస్కార్ట్ వాహనాలతో పాటు రహదారి వెంబడి 120 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

మహిళ అవయవదానం.. 15 సంవత్సరాల బాలుడి జీవితంలో వెలుగులు

విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్‍ కూడలి మీదుగా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా.. 22 నిమిషాల్లో గుండెను ఆస్పత్రికి చేర్చినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లాకు చెందిన 15 సంవత్సరాల బాలుడికి గుండె మార్పిడి చికిత్స చేయనున్నారు. అంతకుముందు విశాఖ షీలానగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ నుంచి విశాఖ విమానాశ్రయానికి మహిళ గుండెను తరలించారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిటీలో అన్ని పోలీస్​స్టేషన్స్ విభాగాలు.. ఎయిర్​పోర్ట్​ జోన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా సకాలానికి విమానాశ్రయానికి చేరుకునేలా బందోబస్తు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా వైద్య బృందాన్ని, గుండెను విశాఖ ఎయిర్​పోర్ట్​కు అధికారులు తరలించారు. మనిషి తమ ముందు లేకపోయినా అవయవదానంతో మరొకరికి పునర్జన్మనిస్తుందని బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా

బ్యాంకు దోపిడీకి వచ్చిన ముగ్గురికి చుక్కలు చూపించిన మహిళా పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.