వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు వివరించింది. ఇందుకోసం బ్యాంకర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఉన్నతాధికారులు, ఎస్సెల్బీసీ కన్వీనర్ కృష్ణన్ శర్మతో పాటు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
కొత్త విధానంలో బ్యాంకింగ్, మార్ట్గేజ్ మాడ్యూల్స్‌కు సంబంధించి సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యాంకర్లకున్న సందేహాలను నివృత్తి చేశారు. మాడ్యూల్స్‌ను ప్రశంసించిన బ్యాంకర్లు... వ్యవస్థలో పారదర్శకతను తీసుకొస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ల విధానానికి సంబంధించి ప్రభుత్వానికి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని బ్యాంకర్లు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చూడండి: ధరణి సమస్యలను పరిష్కరిస్తామన్నారు: ట్రెసా