ETV Bharat / state

బ్యాంకు పని వేళల తాత్కాలిక కుదింపు?

కరోనా బ్యాంకు ఉద్యోగులను కలవరపెడుతోంది. వైరస్​ బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రంలో అన్ని బ్యాంకుల పనివేళలను తాత్కాలికంగా తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. దయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవల్ని పరిమితం చేసే దిశగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సిద్ధమవుతోంది.

author img

By

Published : Apr 22, 2021, 9:20 AM IST

bank
బ్యాంకు పని వేళల తాత్కాలిక కుదింపు?

బ్యాంకుల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వ్యాధి బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రంలో అన్ని బ్యాంకుల పనివేళలను తాత్కాలికంగా తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవల్ని పరిమితం చేసే దిశగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సిద్ధమవుతోంది. బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఎస్‌ఎల్‌బీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మే 15 వరకూ బ్యాంకుల పనివేళలు తగ్గించడంతో పాటు, సగం మంది సిబ్బందితోనే నిర్వహించే అంశంపై చర్చించారు. ఈ నిర్ణయాలను ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. శుక్రవారం నుంచి పనివేళల మార్పు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల పనివేళలు మాత్రం యథావిధిగా ఉంటాయన్నారు. ఈ క్రమంలో ఏటీఎంలు, క్యాష్‌డిపాజిట్‌ మిషన్లు సహా ఇతర ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం లేకుండా చూడాలని బ్యాంకర్లను ఎస్‌ఎల్‌బీసీ ఆదేశించింది. ‘‘జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పని గంటలు కుదించడంతో పాటు, తప్పనిసరి సేవలకు మాత్రమే వినియోగదారులు బ్యాంకులకు వచ్చేలా చూడటం, పరిమిత సిబ్బందితో నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని బ్యాంకు యూనియన్లు ఇప్పటికే విన్నవించాయి.

ఎస్‌బీఐ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌
ఉద్యోగులు కరోనా బారిన పడిన చోట బ్యాంకులను తాత్కాలికంగా మూడు రోజులు మూసివేసి శుద్ధి అనంతరం సేవలను పునఃప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ శాఖలు ఉన్న ఎస్‌బీఐలో 600 మందికిపైగా ఉద్యోగులు, ఇతర బ్యాంకుల్లో వెయ్యి మందికిపైగా సిబ్బంది కరోనా బారిన పడినట్లు సమాచారం. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉండే ఉద్యోగులే ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొందరు మృత్యువాత పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్‌బీఐ ఉద్యోగులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించినట్లు ఆ బ్యాంకు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఖమ్మం పోరులో నిలిచేదెవరు.. పోటీ నుంచి తప్పుకునేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.