హైదరాబాద్ లక్డీకపూల్‌లోని ఓ హోటల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా 112 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్ అధికారులు కస్టమర్స్ మీట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. బ్యాంకుల ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత తరుణంలో తమ బ్యాంక్ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనంతో మరింత మెరుగుపడ్డామని, బిజినెస్ టర్నోవర్‌లో దేశంలో రెండో స్థానంలో కొనసాగుతున్నామని పేర్కొన్నారు. సామాన్యులకు సైతం బ్యాంకు సేవలను అందించేందుకు గ్రామ స్థాయి వరకు తమ బ్రాంచీలను విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
దేశంలో రెండో స్థానంలో 'బ్యాంక్ ఆఫ్ బరోడా' - second place
బ్యాంక్ ఆఫ్ బరోడా 112 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్ అధికారులు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో కస్టమర్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ సత్యనారాయణ పాల్గొన్నారు.