ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని జనచైతన్య కాలనీకి చెందిన వడ్డె రవికుమార్, వడ్డె వరలక్ష్మి అప్పు ఉన్నారని.. ఆ బకాయి మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంక్ అధికారుల పేరిట ఫోన్ చేసి వేధిస్తున్నారని అదే కాలనీకి చెందిన పలువురు మహిళలు అనంతపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒక్కోసారి ఒక్కో బ్యాంకు పేరు చెప్పి తీసుకున్న డబ్బులు చెల్లించాలని.. అసభ్యకరంగా తిడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారం రోజుల నుంచి రోజుకు 20 నుంచి 50కి పైగా ఫోన్ కాల్స్ చేసి.. వడ్డే రవికుమార్, వడ్డే వరలక్ష్మి తీసుకున్న అప్పు చెల్లించాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని వరలక్ష్మి, వడ్డె రవికుమారులను కలిసి అడగ్గా.. ఆ నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లో మాట్లాడవద్దని చెబుతున్నారని వాపోయారు. లోన్ యాప్ల వేధింపుల కన్నా దారుణంగా ఉన్నాయని.. అధికారులు చర్యలు తీసుకొని నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరారు.
ఇవీ చదవండి:
భర్త అడ్డు తొలగించాలనుకుంది.. ఆ భార్య ఏం చేసిందంటే..
తల్లిపై కోపం.. పిల్లాడికి శాపం! ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన వాచ్మన్