ఈనెల 22న తలపెట్టిన బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాంబాబు కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీననాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఎ.ఐ.టి.యు.సి భవన్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 1990లో నూతన ఆర్థిక విధానాల అమలు ప్రారంభమైనప్పటి నుంచి... కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది ఒక ముఖ్యమైన ఏజెండాగా మారిందన్నారు. ప్రభుత్వ బ్యాంకుల అస్తిత్వాన్ని దెబ్బతీసే బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఐక్య పోరాటాలకు ప్రజలు సహకరించాలని కోరారు. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
ఇదీ చూడండి: రేపటి బంద్కు సంపూర్ణ మద్దతు: భాజపా