ETV Bharat / state

Banjarahills CI Bribe Case Updates : లంచం డిమాండ్ కేసు.. బంజారాహిల్స్ సీఐ, ఎస్ఐ, హోంగార్డుకు ఏసీబీ నోటీసులు

Banjarahills CI Bribe Case Updates : డబ్బులు డిమాండ్‌ చేస్తూ పట్టుబడిన బంజారాహిల్స్ సీఐ కేసులో.. ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి సీఐతోపాటు ఎస్సై, హోంగార్డ్‌ను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు ముగ్గురిని ప్రశ్నించిన అధికారులు.. పబ్ వ్యవహారంతో పాటు.. మిగతా వసూళ్ల పైనా ఆరా తీశారు. అనంతరం వారికి నోటీసులు జారీ చేసి.. సోమవారం వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Banjara Hills Police Station
Banjarahills CI Bribe Case Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 1:24 PM IST

Banjarahills CI Bribe Case Updates : పబ్‌లు, స్పా సెంటర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహిల్స్‌ సీఐ (Banjarahills CI) నరేందర్‌ అక్రమాలపై ఏసీబీ మరిన్ని వివరాలు సేకరిస్తోంది. పబ్‌ యజమాని నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేస్తుండగా పట్టుకున్న అధికారులు.. సీఐతోపాటు అతనికి సహకరించిన బంజారాహిల్స్‌ ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని అనిశా కార్యాలయానికి తరలించారు.

ACB Officers Interrogated CI Narender : ఏసీబీ కార్యాలయంలో సుమారు 20 గంటల పాటు ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నించి.. వారి నుంచి వివరాలు సేకరించారు. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని.. బయటి నుంచి ఎటువంటి సంప్రదింపులు జరిపేందుకు అవకాశం లేకుండా చేశారు. సీఐ నరేందర్‌పై ఫిర్యాదు చేసిన పబ్ యజమాని వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. పబ్ వ్యవహారం, మిగతా వసూళ్లపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం సీఐ నరేందర్‌, ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డు శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. దీనిపై సోమవారం వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.

Education Employees Arrested in Bribing Case Telangana : పాఠశాల అనుమతి కోసం లంచం డిమాండ్.. ముగ్గురు విద్యాశాఖ అధికారులు అరెస్టు

అసలేం జరిగిదంటే : హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ నుంచి ఏడాదిన్నర క్రితం బంజారాహిల్స్‌ సీఐగా నరేందర్‌ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరిన నాటి నుంచే ఆయన.. పబ్‌లు, మసాజ్‌ కేంద్రాలు, ప్రైవేట్ పంచాయతీలతో కేసుకో రేటు కట్టి మరీ.. వసూళ్ల దందా ప్రారంభించారనే అనేక ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 18న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్-1లోని రాక్‌ క్లబ్‌ స్కై లాంజ్‌ పబ్‌పై గురిపెట్టాడు.

పబ్‌ నిర్వాహక భాగస్వామి లక్ష్మణ్‌రావును.. మూడు నెలలకు రూ.4.5 లక్షలు మాములు ఇవ్వాలని సీఐ నరేందర్ డిమాండ్‌ చేశాడు. అతను స్పందించకపోవడంతో కొద్ది రోజుల తర్వాత రూ.3 లక్షలు ఇవ్వాలని అడిగాడు. ఈ క్రమంలోనే సీఐ వద్ద హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీహరి తనకు వ్యక్తిగతంగా రూ.10,000 ఇవ్వాలంటూ పబ్‌ నిర్వాహక భాగస్వామిని డిమాండ్‌ చేశాడు. ఇందులో భాగంగానే ఇన్‌స్పెక్టర్‌ ఆదేశాల మేరకు శ్రీహరి.. పబ్‌ నిర్వాహకుడికి పదేపదే వాట్సాప్‌ కాల్‌ చేసి మామూళ్ల కోసం వేధించడం మొదలుపెట్టాడు.

ACB Raids at Marriguda MRO House : రూ.4.75 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు.. మర్రిగూడ తహసీల్దార్​ అరెస్ట్

పబ్‌ నిర్వాహకుడి నుంచి సొమ్ము చేతికి అందకపోవటంతో.. సీఐ నరేందర్ నేరుగా రంగంలోకి దిగి వేధింపులు షురూ చేశాడు. ఎస్‌ఐ నవీన్‌రెడ్డితో పబ్‌లో తనిఖీలు చేయించి కేసులు నమోదు చేశాడు. సెప్టెంబర్‌ 30న అర్ధరాత్రి ఇన్‌స్పెక్టర్‌ ఆదేశాల మేరకు పబ్‌ వద్దకు వచ్చిన ఎస్ఐ.. నిర్వాహక భాగస్వామి లక్ష్మణ్‌రావును బలవంతంగా పోలీసు కారులో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడే కొద్ది గంటలపాటు ఆయనను కూర్చోబెట్టారు.

ACB Raids at Banjara Hills Police Station : ఇలా పోలీసులు.. తనను వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ లక్ష్మణ్‌రావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనిశా అధికారులు సీఐ నరేందర్, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు శ్రీహరిపై కేసు నమోదు చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌తోపాటు నరేందర్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో దాదాపు 15 మంది సిబ్బంది శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వారిని విచారించారు. పలు ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.

TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్

పంథా మార్చని ప్రభుత్వ అధికారులు.. ఏసీబీకి దొరికి జీవితం ఆగం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.