ETV Bharat / state

తెరుచుకోనున్న బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల.. - accreditation of DAV Public School

Banjara Hills DAV Public School incident: తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ గుర్తింపు ఈ  విద్యాసంవత్సరం వరకు పునరుద్ధరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలో ఎల్‌కేజీ చదివే చిన్నారిపై పాఠశాల ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ స్కూల్‌ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి డీఈవోను ఆదేశాలు జారీ చేయగా.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో విద్యాశాఖ ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంది.

Banjara Hills DAV Public School
Banjara Hills DAV Public School
author img

By

Published : Nov 1, 2022, 7:33 PM IST

Updated : Nov 1, 2022, 10:56 PM IST

Banjara Hills DAV Public School incident: తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ గుర్తింపు ఈ విద్యాసంవత్సరం వరకు పునరుద్ధరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలో ఎల్‌కేజీ చదివే చిన్నారి(4)పై పాఠశాల ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ డీఈవోను ఆదేశించారు.

అందులోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని మంత్రి తెలిపారు. విద్యాశాఖ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికిప్పుడు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తే తమ పిల్లలను ఎక్కడికి పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం వరకు పాఠశాల గుర్తింపును కొనసాగించాలని నిర్ణయించింది. విద్యాశాఖ నుంచి అనుమతి లభించడంతో గురువారం నుంచి డీఏవీ పాఠశాల తెరుచుకోనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 1, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.