ఏ ఆధారం లేకుండా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్లో ప్రవేశించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని పరిశ్రమల్లో పనిచేస్తున్న కొందరిని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్కు చెందిన సలీం, ఇస్లాం అనే ఇద్దరు సోదరులు ఇండో బంగ్లా సరిహద్దు ప్రాంతాల నుంచి కొందరు యువకుల్ని అక్రమంగా తీసుకొచ్చారు. వారికి రుద్రారం ఆల్ కబీర్ పరిశ్రమలో పని కల్పించారు. వీరు దొంగ ధ్రువీకరణ పత్రాలు సంపాందించి స్థానిక యువతులను వివాహం చేసుకున్నారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: కేసీఆర్ను అవమానించే వీడియోలు, వ్యక్తి అరెస్ట్