హైదరాబాద్ బండ్లగూడ 'రాజీవ్ స్వగృహ' ఫ్లాట్‌ల కేటాయింపు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. హెచ్ఎండీఏ, మున్సిపల్‌శాఖ, జీహెచ్ఎంసీల సమన్వయంతో జూబ్లీహిల్స్ అంబేడ్కర్ యూనివర్సిటీలో అధికారులు ఈ లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ఫ్లాట్ నంబర్‌లు, దరఖాస్తుదారుల పేర్లను వేర్వేరుగా ఎంచుకోవడం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు చేస్తున్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి, పూర్తి ప్రక్రియ రికార్డ్ చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. ఒక ఆధార్‌కు.... ఒక ఫ్లాట్‌కు మాత్రమే అర్హత కలిగి ఉంటుందని అంతకంటే ఎక్కువ లాటరీలో వస్తే... ఒకటే ఫ్లాటు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. లాటరీలో ఫ్లాట్ వచ్చిన వ్యక్తి 7 రోజుల్లోపు 10 శాతం, 60 రోజుల్లోపు 80 శాతం, అలాట్‌మెంట్ లెటర్ జారీ చేసిన తేదీ నుండి 90 రోజులలోపు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని వెల్లడించారు.