ETV Bharat / state

ప్రాజెక్టుల్లో లోపాల వల్లే వరుస ప్రమాదాలు: బండి సంజయ్ - Bandi sanjay comments on state projects

తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల్లో లోపభూయిష్ట డిజైన్ల కారణంగా వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రాజెక్టులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందాన్ని నియమించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​కు లేఖ రాశారు.

'సాంకేతిక బృందాన్ని నియమించాలని బండి సంజయ్ లేఖ'

author img

By

Published : Oct 20, 2020, 7:07 PM IST

తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందాన్ని నియమించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల్లో లోపభూయిష్ట డిజైన్ల కారణంగా వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూగర్భ పంప్ హౌజ్ నిర్మాణం కోసం పేలుళ్లు జరపడం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ మునిగిపోయిందని మండిపడ్డారు. భద్రతా నిబంధనలను విస్మరించి పీఆర్ఎల్ఐఎస్ భూగర్భ పంపుహౌస్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని విమర్శించారు. ఫలితంగా కేఎల్ఐఎస్ పంపుహౌస్​కు ప్రమాదం జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు.

తెలంగాణలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాల్లో లోపాలు, తప్పుడు డిజైన్లు, సాంకేతిక వైఫల్యాల కారణంగా ప్రాణనష్టం, వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు డీపీఆర్ సమర్పించమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేఆర్ఎంబీ/ జీఆర్ఎంబీ పదేపదే కోరినా... ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లను కేఆర్‌ఎమ్‌బీ, జీఆర్‌ఎమ్‌బీలకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెంటనే సమర్పించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ఇదీ చదవండి: తెలంగాణలో దసరా వరకూ పరీక్షలన్నీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.