Bandi Sanjay vs Etela Rajender: హైదరాబాద్లో బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పోలీంగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నేతల మధ్య సమన్వయ లోపం బయటపడింది. ఓ వైపు బండి సంజయ్ ప్రసంగ సమయంలోనే.. మరో వైపు ఈటల రాజేందర్ ప్రసంగించారు. వరంగల్ తూర్పు నుంచి ఈటల రాజేందర్ ప్రసంగించారు. ఇలా జరుగడం సాంకేతిక లోపమా... కావాలనే చేశారా అనే దానిపై పార్టీ ఆరా తీస్తుంది. బండి సంజయ్ వరంగల్ తూర్పు తప్ప మినహా.. మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రసంగించారు.
అంతకుముందు బండి సంజయ్ సరల్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్‌లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను పొందుపరుస్తున్నామని తెలిపారు. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం.. పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. బీజేపీకి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలే మూల స్తంభమని బండి సంజయ్ తెలిపారు.
ఇవీ చదవండి: రాజకీయాలు కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి: బండి సంజయ్
అంజలి కేసులో డ్రగ్స్ కోణం? కీలకంగా మారుతున్న స్నేహితురాలు నిధి!