సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను సీఎం కేసీఆర్ విస్మరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణనదిలో తెలంగాణ వాటా 299టీఎంసీల నీటిని సైతం పూర్తిగా వినియోగించుకోవడంలోనూ కేసీఆర్ విఫలమయ్యారన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును నిరసిస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బండి సంజయ్‌కుమార్ నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన నిరసన దీక్ష సాయంత్రం 5గంటల వరకూ కొనసాగనుంది.
కేఆర్‌ఎంబీ, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ జీవో 203 తెచ్చారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టవిరుద్ధ నీటి వినియోగంపై తెరాస సర్కార్ పట్టింపులేకుండా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా జీవోతో పాత రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలపై దుష్ప్రభావం పడుతుందన్నారు.
ఏపీ ప్రభుత్వం ఈనెల 5న జీవో జారీ చేస్తే... ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం అనేక అనుమానాలు వస్తున్నాయి.‘‘ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి రెండు తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా దోచుకుంటున్నారో.. ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో దీని ద్వారా స్పష్టమవుతోంది. .......... బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి:113 ఏళ్ల వయసులో కరోనాను కసితీరా ఓడించి!