Bandi Sanjay teleconference on Khammam BJP meeting : కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా ఖమ్మం బహిరంగ సభను సక్సెస్ చేయాలని పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ పోలింగ్ బూత్ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. తెలంగాణ ప్రజల దృష్టంతా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపైనే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సభ విజయవంతం అయితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్నారు.
- Bandi Sanjay on BJP Khammam : 'ఖమ్మంలో కమలం తప్పకుండా వికసిస్తుంది'
- Bandi Sanjay On Telangana Formation Day : 'తొమ్మిదేళ్ల BRS పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు'
కాంగ్రెస్ నేతలు కూడా ఈ సభ ఫెయిల్ కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల బలం చూపే సమయమొచ్చిందని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు ఈ సభతో కనువిప్పు కలిగించాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరు అవుతారని పేర్కొన్న బండి సంజయ్.. అభినవ పటేల్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, పోలీంగ్ బూత్ సభ్యులకు బహిరంగ సభ ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జన సమీకరణ చేసేందుకు పలు సూచనలు చేశారు.
Amit Shah public meeting in Khammam : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం గట్టి ప్రణాళికలు రచిస్తోంది. ఈ సారి తప్పకుండా రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగురవేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఆ దిశగానే మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని తెలియజేసే విధంగా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టింది. శుక్లవారం ఖమ్మం జిల్లాలోని బీజేపీ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ అమిత్ షా పర్యటనను ప్రకటించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడి వారిని ఉత్సాహాపరిచారు. ఖమ్మం జిల్లాలో కమలం తప్పకుండా వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ లేదని కొందరు అవమానిస్తున్నారని పేర్కొన్న ఆయన.. పార్టీ బలమేంటో అమిత్ షా మీటింగ్‌ను విజయవంతం చేసి నిరూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ మీటింగ్ తరువాత ఈనెల 20వ తేదీన నాగర్ కర్నూల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఆ మీటింగ్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్రంలో మరో బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అందులో ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 199 నియోజక వర్గాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: