ETV Bharat / state

బండి సంజయ్ కుమారుడు భగీరథకు నోటీసులు - Clash in Mahindra University

Police notices for Bandi Bhagiratha
Police notices for Bandi Bhagiratha
author img

By

Published : Jan 27, 2023, 5:06 PM IST

Updated : Jan 27, 2023, 6:56 PM IST

16:49 January 27

బండి సంజయ్ కుమారుడు భగీరథకు నోటీసులు

Police notices for Bandi Bhagiratha: బండి సంజయ్​ కుమారుడు బండి భగీరథకు పోలీసులు నోటీసులు జారీచేశారు. గత కొద్ది రోజుల కిందట మహీంద్ర వర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి చేశాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథకు 41 ఏ సీఆర్​పీసీ కింద దుండిగల్​ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇది జరిగింది: మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్టు విశ్వ విద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు కొద్ది రోజుల కిందట దుండిగల్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రాంగణంలోనే ఈ దాడి జరిగిందని.. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద భగీరథపై కేసు నమోదు చేశారు.

బండి భగీరథపై కేసు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా​ స్పందిచారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక బీఆర్​ఎస్​ ప్రభుత్వం తమ కుమారుడిపై కేసులు పెట్టించిందని ఆరోపించారు. రాజకీయ అవసరాలు కోసం కుటుంబీకులను ఉపయోగించుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అవి కళాశాల గొడవలని.. పిల్లలు ఈరోజు గొడవపడి రేపే ఒక్కటైపోతారని వ్యాఖ్యానించారు. తన కుమారుడు నిజంగా తప్పు చేస్తే ఏ శిక్ష వేసిన భరిస్తామని.. తానే స్వయంగా స్టేషన్​కు తీసుకెళ్లి అప్పగిస్తానని పేర్కొన్నారు.

వీడియో హల్​చల్.. సీన్​ రివర్స్​: బండి భగీరథ మహేంద్ర విశ్వవిద్యాలయంలో మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నారు. శ్రీరామ్ అనే విద్యార్థిని దూషిస్తూ దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారింది. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థి వీడియో సైతం బయటికి వచ్చింది. బండి భగీరథ స్నేహితుడి చెల్లెల్ని వేధించినందుకే భగీరథ తనపై దాడి చేశాడని.. ఇందులో అతని తప్పేమీ లేదని శ్రీరామ్ వీడియోలో పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 27, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.