ఎందరో ప్రజల బలిదానాల వల్ల తెలంగాణ సాకారమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. భాజపా మద్దతుతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసిన బండి సంజయ్.. ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగట్లేదని ఆరోపించారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని తెలిపారు. హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంలో తెలంగాణ అంశాలపై చర్చించామని బండి సంజయ్ తెలిపారు. అవినీతి, కుటుంబ పాలనపై వివరించామన్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబమే కేబినెట్‌గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోందని దుయ్యబట్టారు. భాజపా పోరాటం చూసి కేసీఆర్‌లో భయం మొదలైందన్న సంజయ్.. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఎందరో ప్రజల బలిదానాల వల్ల తెలంగాణ సాకారమైంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. కేసీఆర్ కుటుంబమే కేబినెట్‌గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోంది. భాజపా పోరాటం చూసి కేసీఆర్‌లో భయం మొదలైంది. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది.-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి..
'అసదుద్దీన్ ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే.. తెరాస పాలన నడిపిస్తోంది'
Yadamma respond: కావాలనే తప్పుడు ప్రచారం.. ఆ వార్తలను ఖండించిన యాదమ్మ