హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని( Huzurabad by election 2021) ముమ్మరం చేశాయి. హుజూరాబాద్‌లోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... తెరాసపై విమర్శలు చేశారు. దళితబంధు నిలిపివేతపై తెరాస అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో( Huzurabad by election 2021) ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెరాస వాళ్లే లేఖ రాసి.. పథకాలు ఆపి.. భాజపాపై నెపం వేస్తారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతారు. దళితబంధు నిధులు ఖాతాల్లో వేసి విత్‌డ్రా చేసుకోనివ్వలేదు. దళితబంధు నిధులు ఇవ్వాలని భాజపా డిమాండ్ చేస్తోంది. దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా? యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. అని బండి సంజయ్ అన్నారు.
గ్రామాల్లో చేపట్టే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తోంది. రైతువేదికలు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనానికి కేంద్రం నిధులు ఇస్తోంది. దళితబంధు నిలిపివేతపై తెరాస అబద్ధాలు చెప్తోంది. తెరాస వాళ్లే లేఖ రాసి, పథకాలు ఆపి, భాజపాపై నెపం వేస్తారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతారు. దళితబంధు నిధులు ఖాతాల్లో వేసి, విత్‌డ్రా చేసుకోనివ్వలేదు. దళితబంధు నిధులు ఇవ్వాలని భాజపా డిమాండ్ చేస్తోంది. దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా? యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి కేసీఆర్ సిద్ధమా?. నాగార్జుసాగర్ ఎన్నిక తర్వాత గొర్రెల పంపిణీ పథకం ఆగిపోయింది.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. హుజూరాబాద్( Huzurabad by election 2021) ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నాయని చీఫ్ విప్ బాల్కసుమన్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుయాయులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్లనే కాంగ్రెస్ నుంచి బలహీనమైన అభ్యర్థిని బరిలో దింపారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి భాజపా నాయకులు అనేక అబద్దపు ప్రచారాలు చేస్తూ నిజాన్నినమ్మించే విధంగా విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇదీ చదవండి: CM KCR Focus on Drugs Control: పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం