ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ బహిరంగ లేఖ - పోలీసు నియామకాల గురించి బండి బహిరంగ లేఖ

Bandi Sanjay Letter to CM KCR : పోలీసు నియామకాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. దేహదారుఢ్య పరీక్షల్లోని లోపాలను, అవకతవకలను వెంటనే సవరించాలని లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల లక్షలాది మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారన్నారు.

Bandi Sanjay letter to CM KCR
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​
author img

By

Published : Dec 23, 2022, 6:03 PM IST

Bandi Sanjay Letter to CM KCR : రాష్ట్రంలోని పోలీసు నియామకాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. వెంటనే దేహదారుఢ్య పరీక్షల్లోని లోపాలను, అవకతవకలను సవరించి.. వారికి న్యాయం చేయాలని లేఖలో కోరారు. దేహదారుఢ్య పరీక్షలను నోటిఫికేషన్​లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయని బండి లేఖలో పేర్కొన్నారు. లాంగ్​ జంప్​, షార్ట్​ పుట్​ పరీక్షల్లో నోటిఫికేషన్​లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దాదాపు రెండు లక్షల మంది పురుష, మహిళ అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని బండి సంజయ్​ లేఖలో ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన పోలీసు నియామకాల ప్రక్రియ ప్రారంభం నుంచి వివాదాలకు ఆడ్రస్​గా మారడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్​ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం అని వాపోయారు. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్​కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్​ క్వాలిఫై చేయడం అన్యాయమని బండి సంజయ్​ లేఖలో పేర్కొన్నారు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాంగ్​ జంప్​ దూరం 3.8 మీటర్లుగానే ఉందని.. కానీ ఇక్కడ మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడం వల్ల అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లాంగ్​ జంప్​తో పాటు షాట్​పుట్​ విషయంలోనూ పాత విధానాన్నే అమలు చేయాలని.. లాంగ్​ జంప్​లో ఆన్​ది లైన్​ను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్​ఐ, కానిస్టేబుల్​ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు గానూ.. అభ్యర్థులందరికీ మార్కులు కలపాలన్నారు. తక్షణమే జరిగిన తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని బండి సంజయ్​ కోరారు.

సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ బహిరంగ లేఖ
సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ బహిరంగ లేఖ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.