నాగార్జునసాగర్ ఉపఎన్నికల సందర్భంగా రచయిత వెంకట్రావు రాసిన 'భాజపా విజయ శంఖారావం' అనే పాటల సీడీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో పాటు పలువురు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
భాజపా విభిన్నమైన సంస్కృతి కలిగిన పార్టీ అని పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. దేశంలో ఏ పార్టీని చూసిన కుటుంబ రాజకీయాలు కల్గిన పార్టీలేనని ఆరోపించారు. భాజపా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆయన మంత్రి వర్గంపైన ఇప్పటివరకు ఎటువంటి ఆరోపణలు రాలేదన్నారు.
ఇదీ చదవండి: మద్యం దుకాణాలు, థియేటర్లపై కరోనా ఆంక్షలేవీ..?: హైకోర్టు