ETV Bharat / state

ప్రధాని పిలుపు.. భాజపా కార్యకర్తల సేవ: బండి సంజయ్ - corona updates

హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్ స్కూల్‌లో పేదలకు పంపేందుకుగాను భాజపా కార్యకర్తలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బియ్యం పంపిణీ చేశారు.

ప్రజా సేవలో భాజపా కార్యకర్తలు
ప్రజా సేవలో భాజపా కార్యకర్తలు
author img

By

Published : Apr 11, 2020, 4:33 PM IST

ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్క భాజపా కార్యకర్త ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సేవ చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్ స్కూల్‌లో పేదలకు పంపేందుకుగాను భాజపా కార్యకర్తలకు బండి సంజయ్‌ బియ్యం పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశల వారిగా కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సంపాదన ముఖ్యం కాదని సమాజం ముఖ్యమనే ధోరణితో ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నా.. రాష్ట్ర భాజపా శాఖ సహకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని బండి సంజయ్‌ కోరారు.

ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.